Gautam Ghattamaneni roaming in New York Roads Sitara Comment goes Viral
Gautam – Sitara : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం న్యూయార్క్‌లో న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా న్యూయార్క్ లో ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు షేర్ చేస్తున్నాడు గౌతమ్. అయితే తాజాగా గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతుంటే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ షేర్ చేసిన వీడియోతో వైరల్ అవుతున్నాడు.
Also Read : Pooja Hegde : పేరెంట్స్ తో పూజా హెగ్డే దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు చూసారా..
షాన్ రిజ్వాన్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ అమెరికాలో రోడ్ల మీద కనపడే వాళ్ళ దగ్గరికి వెళ్లి తను ప్లే చేసిన సాంగ్ కనిపెడితే డబ్బులు ఇస్తాను అంటూ వీడియోలు చేస్తాడు. ఇలా తాజాగా రోడ్ మీద వెళ్తున్న కొంతమందిని ఆపి బాలీవుడ్ సాంగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోవి చెప్పమన్నాడు. అయితే షాన్ రిజ్వాన్ ఆపిన వాళ్ళల్లో మన గౌతమ్ ఘట్టమనేని కూడా ఉన్నాడు. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో వెళ్తుంటే షాన్ ఆపి ఇలా వీడియో తీసాడు. ఇందులో గౌతమ్ కూడా మాట్లాడాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మహేష్ ఫ్యాన్స్ అయితే గౌతమ్ బాబు న్యూయార్క్ లో రోడ్ల మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. షాన్ రిజ్వాన్ షేర్ చేసిన ఈ వీడియో కింద సితార.. మా అన్న అక్కడ ఏం చేస్తున్నాడు అంటూ ఆసక్తికర కామెంట్ చేసింది. గౌతమ్ కూడా అదే వీడియోకి.. నిజంగా నేను అక్కడ ఏం చెయ్యట్లేదు అని కామెంట్ చేయడం గమనార్హం. ఈ వీడియోలో మహేష్ తనయుడు ఉండటం, సితార కామెంట్ చేయడంతో ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.