Gautham Menon : ఆస్కార్ కి ‘ఛెల్లో షో’ ఎంపిక కరెక్ట్ అవ్వొచ్చు.. త్వరలోనే సినిమా చూస్తా..

తాజాగా ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపికపై దర్శకుడు గౌతమ్ మీనన్ స్పందించారు. గౌతమ్ మీనన్ దీనిపై స్పందిస్తూ.. ''అన్ని అర్హతలున్న సినిమానే ఎంపిక చేస్తారు. ‘ఛెల్లో షో’ సినిమాని నేను ఇంకా చూడలేదు కాబట్టి సినిమా గురించి మాట్లాడను. సెలక్షన్ కమిటీలో............

Gautham Menon : ఆస్కార్ కి ‘ఛెల్లో షో’ ఎంపిక కరెక్ట్ అవ్వొచ్చు.. త్వరలోనే సినిమా చూస్తా..

Gautham Menon reacts on Chello Show movie selection for Oscar

Updated On : September 26, 2022 / 12:33 PM IST

Gautham Menon : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా మంది ప్రేక్షకులు, సినిమా వాళ్ళు, టెక్నీషియన్స్ RRR సినిమాని అభినందించారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని, ఆస్కార్ వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అసలు ఆస్కార్ బరిలో కూడా నిలవలేదు. ఈ సంవత్సరం భారత్ నుంచి ఆస్కార్ కి ఛెల్లో షో అనే సినిమా ఎంపికైంది. రాజమౌళి హాలీవుడ్ మీడియాతోనే ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా ఫిలిం మేకింగ్ మారదని తెలిపాడు. ఆస్కార్ నామినేషన్స్ లో RRR సినిమా లేకపోవడంపై ఒక్కక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

తాజాగా ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపికపై దర్శకుడు గౌతమ్ మీనన్ స్పందించారు. ఇటీవలే శింబు హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ అఫ్ ముత్తు’ సినిమా రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మీడియా ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపికపై మీ అభిప్రాయం ఏంటి అని గౌతమ్ మీనన్ ని అడిగారు.

Swathimuthyam Director : చిరంజీవి, నాగార్జునకి పోటీగా.. అది నిర్మాతల నిర్ణయం.. నాకు భయంగానే ఉంది..

గౌతమ్ మీనన్ దీనిపై స్పందిస్తూ.. ”అన్ని అర్హతలున్న సినిమానే ఎంపిక చేస్తారు. ‘ఛెల్లో షో’ సినిమాని నేను ఇంకా చూడలేదు కాబట్టి సినిమా గురించి మాట్లాడను. సెలక్షన్ కమిటీలో అనుభవజ్ఞులు, మేధావులున్నారు. ప్రత్యేకంగా ఆ సినిమానే సెలెక్ట్ చేశారంటే కచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. త్వరలోనే ఆ సినిమాని చూస్తాను” అని తెలిపారు.