Swades Actor Gayatri
Ferrari-Lamborghini Crash: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సినిమా స్వేడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి జోషి త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తన భర్త వికాస్ ఒబెరాయ్ తో కలిసి ఇటలీలోని సార్డినియాలో గాయత్రి జోషి లంబోర్ఘి కారులో వెళుతోంది.
ఆ సమయంలో వారి కారు అదుపుతప్పి ఫెరారీ కారుతో పాటు క్యాంపెర్ వ్యానును ఢీ కొట్టింది. ఆ కార్లన్నీ బోల్తా పడ్డాయి. అనంతరం ఫెరారీ కారులో మంటలు అంటుకున్నాయి. ఫెరారీ కారులోని దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లు మెలిస్సా క్రౌట్లీ (63), మార్కస్ క్రౌట్లీ (67)గా అధికారులు గుర్తించారు.
వారిది స్విట్జర్లాండ్స్ అని గాయత్రి జోషితో పాటు ఆమె భర్త బాగానే ఉన్నారని వారి మేనేజర్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గాయత్రి జోషి దంపతుల పరిస్థితిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
గాయత్రి జోషి నటిగా, మోడల్ గా వీడియో జాకీగా రాణించింది. వికాస్ ఒబెరాయ్ ని 2005లో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయత్రి భర్త వికాస్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాడు. ఆయన ఒబెరాయ్ రియాల్టీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్.
Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T
— Globe Clips (@globeclip) October 3, 2023