Sudigali Sudheer
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ – తమిళ నటి దివ్యభారతి జంటగా తెరకెక్కుతున్న సినిమా GOAT. ఈ సినిమా ఎప్పుడో మొదలయినా పలు కారణాలతో మధ్యలో ఆగిపోయి మళ్ళీ మొదలయి సాగుతూ పూర్తయింది. ఇక ఈ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలి పలు వివాదాలు సృష్టించడంతో నిర్మాతలతో విబేధాలు వచ్చాయి. రీసెంట్ గా కూడా నరేష్ హీరోయిన్ దివ్యభారతి పై సోషల్ మీడియాలో నెగిటివ్ గా వ్యాఖ్యలు చేయడం, హీరోయిన్ రియాక్ట్ అవ్వడం.. ఇది పెద్ద ఇష్యూగా మారింది.(Sudigali Sudheer)
సుధీర్ – దర్శకుడికి క్లోజ్ అవ్వడంతో సుధీర్ కూడా ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి సుధీర్ రాలేదు. హీరో లేకుండానే సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు. సుధీర్ ఎందుకు రాలేదు అనేదానిపై మాట్లాడుతూ నిర్మాత సుధీర్, దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read : G.O.A.T Teaser : సుడిగాలి సుధీర్ నెక్స్ట్ సినిమా.. GOAT టీజర్ వచ్చేసింది..
టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా నిర్వాత.. సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, ఆయన కింద నుంచి పైకి వచ్చాడు, ఆయన మంచోడు అనే పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసాము. ఈ సినిమా ఇష్యూ ఛాంబర్ లో ఉంది. ఛాంబర్ లో సాల్వ్ అయ్యేవరకు నేను ఎక్కువగా మాట్లాడను. సుధీర్ కి ఆ డైరెక్టర్, టీమ్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి. డైరెక్టర్ ఈ సినిమా సీన్స్ లీక్ చేసారు. అసలు కరెక్ట్ కాదు కదా. దానిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము.
అది సుధీర్ గారి లైఫ్ కి, మూవీ టీమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. హీరోయిన్ విషయంలో కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ సినిమా డైరెక్టర్ గతంలో కూడా రెండు సినిమాలు ఆగిపోయాయి. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. షూటింగ్ మధ్యలో అయిపోయింది. సుధీర్ గారికి రెండు సార్లు చెప్పాను, ఆయన మాట్లాడి మల్లి షూట్ మొదలుపెట్టించారు, బడ్జెట్ పెంచారు అయినా డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు. సుధీర్ గారికి వాళ్ళ గురించి తెలుస్తుంది త్వరలో అనుకుంటున్నాను. ఇది సుధీర్ గారి సినిమా. మన ఇద్దరి మధ్య ఏం లేదు. మీరు రండి ప్రమోషన్స్ కి. మంచి సినిమా ఇది. మీరు ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. సుధీర్ కూడా ప్రమోషన్స్ లో పార్ట్ అయితే సంతోషిస్తాం. భవిష్యత్తులో ఈవెంట్స్ కి సుధీర్ వస్తారని అనుకుంటున్నాను అని అన్నారు. దీంతో సుధీర్ పై, దర్శకుడిపై నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Anurag Kulkarni : వీళ్లది లవ్ మ్యారేజ్ కాదంట.. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంపై స్టార్ సింగర్ కామెంట్స్..