డాక్టర్ల పొరపాటు – రెండు జంటల గందరగోళం : ఫన్నీగా ‘గుడ్‌న్యూస్’ ట్రైలర్
అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌న్యూస్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌న్యూస్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గుడన్యూస్’.. రాజ్ మెహతా దర్శకత్వంలో, ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. సోమవారం ‘గుడ్‌న్యూస్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
అక్షయ్, కరీనా జంట ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలనుకోవడం, దిల్జీత్, కియారా జంట కూడా అదే కోరికతో అదే హాస్పిటల్‌కి రావడం.. పొరపాటున ఒకరి స్పెర్మ్ మరొకరి భార్యకు ఇంజెక్ట్ చేయడం.. ఇక అక్కడినుండి కథ రకరకాల మలుపులు తిరగడం.. క్లుప్తంగా ఈ సినిమా కథ ఇదే అని ట్రైలర్‌లో చూపించారు.
Read Also : తన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్ : ‘సావిత్రిబాయి ములుసరే’గా కాజోల్
ఈ రోజుల్లో చాలామంది భార్యభర్తలు ఎదర్కొంటున్న ప్రాబ్లమ్‌కి కామెడీ యాడ్ చేసి తెరకెక్కించిన ‘గుడ్‌న్యూస్’.. డిసెంబర్ 27న విడుదల కానుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే : జ్యోతి కపూర్, డైలాగ్స్ : జ్యోతి కపూర్, రిషబ్ శర్మ, రాజ్ మెహతా. అడిషనల్ స్క్రీన్‌ప్లే : రిషబ్ శర్మ. సినిమాటోగ్రఫీ : విష్ణు రావ్. ఎడిటింగ్ : ఏ.శ్రీకర్ ప్రసాద్. నిర్మాతలు : హిరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్.