Hunger : ఈ షార్ట్ ఫిలిం చూశారా? బోలెడన్ని ఇంటర్నేషనల్ అవార్డులు..

హంగర్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటికే 10 కి పైగా ప్యారిస్, లండన్.. ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సాధించింది.

Gopala Hunger Short Films Getting International Awards

Hunger Short Film : ఇటీవల మన సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ వేదికపై బోలెడన్ని అవార్డులు గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా షార్ట్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ వేదికల్లో అవార్డులు గెలుచుకుంటాయి. తెలుగులో తీసిన ‘హంగర్’ అనే షార్ట్ ఫిలిం ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది. తాజాగా న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెలుచుకుంది హంగర్ షార్ట్ ఫిలిం.

న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి తన ప్యాషన్‌తో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు. ఇప్పటికే గోపాల్ పలు షార్ట్ ఫిలిమ్స్ తీయగా చాలా అవార్డులని గెలుచుకున్నాడు. గతంలో ఇతను చేసిన మరణం షార్ట్ ఫిలిం కూడా ఏకంగా 34 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఇటీవల నాలుగు నెలల క్రితం తీసిన హంగర్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటికే 10 కి పైగా ప్యారిస్, లండన్.. ఇలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సాధించింది.

Also Read : Nabha Natesh Brother : నభా నటేష్ తమ్ముడ్ని చూశారా? సిక్స్ ప్యాక్‌తో హీరోలా ఉన్నాడుగా..

తాజాగా గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ హంగర్ షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. ఇతను తీసిన మరణం, హంగర్ సినిమాలు ఇటీవల దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి కూడా ఎంపిక అయ్యాయి. మరి ఫ్యూచర్ లో 70mm సినిమా తీస్తాడేమో చూడాలి ఈ డైరెక్టర్. హంగర్ షార్ట్ ఫిలిం మీరు కూడా ఒకసారి చూసేయండి..