Gopichand Dimple Hayathi Ramabanam second single released
Ramabanam : మాచో స్టార్ గోపీచంద్ చాలా గ్యాప్ తరువాత రామబాణం అనే ఫామిలీ ఎంటర్‌టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. శ్రీవాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు సూపర్ హిట్టులుగా నిలిచాయి. దీంతో ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి బుజ్ నెలకుంది. ఒక పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క ప్రమోషన్స్ కూడా పరుగులు పెట్టిస్తున్నారు.
Gopichand RamaBanam : గోపీచంద్ మొదటి బాణం అదిరిపోయింది.. రామబాణం ఫస్ట్ లుక్ టీజర్..
గ్లింప్స్, టీజర్, స్పెషల్ పోస్టర్స్ అంటూ వరుస అప్డేట్స్ తో సినిమాని ఆడియన్స్ లో నిలబెడుతున్నారు. ఇటీవలే Iphone అనే సాంగ్ రిలీజ్ చేయగా, నేడు (ఏప్రిల్ 14) సెకండ్ సింగల్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని గుడిలో జరిగే ఉత్సవం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించారు. దరువు వెయ్యరా, చిందు వెయ్యరా, పంబ రేగాలి అంటూ సందడితో సాగిపోతున్న సాంగ్ లో గోపీచంద్, డింపుల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకి మీకీ జె మేయర్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి పాడారు.
కాగా ఈ సినిమా వేసవి కానుకగా మే 5న విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి భూపతి రాజా కథని అందిస్తున్నాడు. సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు నటిస్తున్నారు. గ్లింప్స్ అండ్ టీజర్ చూసిన దాని బట్టి ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతుందని అర్ధమవుతుంది. మరి గోపీచంద్ అండ్ శ్రీవాస్ హ్యాట్రిక్ అందుకుంటారా? లేదా? చూడాలి.