Gopichand Kavya Thapar Viswam Movie Trailer Released
Viswam Trailer : హీరో గోపీచంద్ శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమాతో రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్స్ పై టిజి విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే విశ్వం సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ట్రైన్ లో ఫ్యామిలీ కామెడీతో పాటు టెర్రరిజం కాన్సెప్ట్, భారీ యాక్షన్ సీన్స్ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
ఈ సినిమాలో గోపీచంద్ యాక్షన్ తో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఓ సమస్య గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్టు ప్రమోషన్స్ లో శ్రీనువైట్ల తెలిపారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.