Gopichand Power-Packed Ramabanam Trailer Impressive
Ramabanam Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో గోపీచంద్‌కు సాలిడ్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీవాస్ రామబాణం చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాతో వీరిద్దరు హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్.
Ramabanam: రామబాణం ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్..!
కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌ను పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు. గోపీచంద్‌లోని మాస్, యాక్షన్‌ను మరోసారి ఈ సినిమాలో మనకు పూర్తిగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ గోపీచంద్ అన్నావదినల పాత్రల్లో నటిస్తుండటంతో.. ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది.
Ramabanam : రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
అన్ని కమర్షియల్ అంశాలను కలిగి ఉన్న రామబాణం ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో గోపీచంద్ ప్రేక్షకులకు ఫుల్‌మీల్స్ ఇవ్వడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న ప్రపంవచ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి రామబాణం సినిమాతో గోపీచంద్-శ్రీవాస్ కాంబో హ్యాట్రిక్ అందుకుంటుందో లేదో చూడాలి.