Ramabanam: రామబాణం ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్..!

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘రామబాణం’ మే 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఏప్రిల్ 20న ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Gopichand Ramabanam Movie Trailer Release Date And Venue Locked

Ramabanam: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Ramabanam : రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. అందుకే వారికోసం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను ఏప్రిల్ 20న రాజమహేంద్రవరంలోని విఎల్ పురమ్ మర్గాని ఇస్టేట్స్‌లో సాయంత్రం 5 గంటలకు జరగనుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Ramabanam : పంబరేపిన గోపీచంద్, డింపుల్.. రామబాణం సెలబ్రేషన్ సాంగ్ రిలీజ్..

ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు, ఖుష్బూ హీరో అన్నవదినల పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మే 5న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.