Seetimaarr : సౌత్ కా సత్తా మార్ కే నయ్.. ‘సీటీ మార్’ కే దిఖాయేంగే..
మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు..
- sekhar
- Published On : August 31, 2021 / 04:06 PM IST
Seetimaarr
Seetimaarr: మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో, మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో.. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మించారు.
Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!
పాండమిక్ కారణంగా విడుదల వాయిదా పడిన ఈ సినిమాను సెప్టెంబర్ 3న రిలీజ్ చేద్దామనుకున్నారు. కట్ చేస్తే సెప్టెంబర్ 10న రావాల్సిన నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ ‘సీటీ మార్’ టీం ఫిక్స్ చేసుకున్నారు. మంగళవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు.
Sharat Saxena : ఏడు పదుల వయసు.. హీరోలకు దీటుగా ఫిజిక్..
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన గోపిచంద్, తమన్నా లుక్స్‌కి, టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా ‘జ్వాలా రెడ్డి’ సాంగే వినబడుతోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. గోపి చంద్ మాస్ పర్ఫార్మెన్స్, కబడ్డీ ఆట గురించి ఎమోషనల్‌గా చెప్పిన విధానం.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.
. @YoursGopichand & @tamannaahspeaks look Fantastic! A BIG Screen experience for sure! ?https://t.co/2OljVmP1QB#??????????????????
Good luck @IamSampathNandi@srinivasaaoffl @SS_Screens @DiganganaS @bhumikachawlat @actorrahman #Manisharma @adityamusic
— RAm POthineni (@ramsayz) August 31, 2021
దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా ఇంపార్టెంట్ రోల్ చేశారు. తరుణ్ అరోరా, రెహ్మాన్, రావు రమేష్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అప్సర రాణి ‘నా పేరే పెప్సీ ఆంటీ’ అనే స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. ఈ సినిమాకి సంగీతం : మణిశర్మ, కెమెరా : సౌందర్ రాజన్, ఎడిటర్ : తమ్మిరాజు, స్టంట్స్ : వెంకట్, రియల్ సతీష్, స్టంట్ శివ, స్టంట్ జాష్వా.
