Site icon 10TV Telugu

Viswam Teaser : గోపీచంద్ ‘విశ్వం’ టీజ‌ర్‌.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ.. న‌వ్వులే న‌వ్వులు

Gopichand Viswam Teaser out now

Gopichand Viswam Teaser out now

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కావ్యా థాపర్ క‌థానాయిక‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను మొద‌లు ప‌ట్టింది. అందులో భాగంగా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్‌ మేళవింపుగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థమవుతోంది. ‘మీరు ఫైట్ చేసిన స్టైల్‌ను బ‌ట్టి చూస్తే మీకు మార్ష‌ల్ ఆర్ట్స్ బాగా తెలుసిన‌ట్లుగా ఉంది అన‌గా.. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు..’ అనే డైలాగ్ బాగా పేలింది. అటు గోపిచంద్‌కు ఇటు శ్రీనువైట్ల‌కి ఈ సినిమా విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం.

Nandamuri Balakrishna : తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం.. ఎంతంటే..?

Exit mobile version