అక్టోబర్ 5న చాణక్య

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌.. 'చాణక్య'.. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : September 21, 2019 / 07:28 AM IST
అక్టోబర్ 5న చాణక్య

Updated On : September 21, 2019 / 7:28 AM IST

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌.. ‘చాణక్య’.. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది..

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా.. ‘చాణక్య’.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

చాణక్య మూవీని దసరా కానుకగా విడుదల చెయ్యాలనుకున్నారు కానీ డేట్ ఫిక్స్ చెయ్యలేదు. రీసెంట్‌గా దసరా స్పెషల్‌గా అక్టోబర్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పంతం నిరాశ పరచడంతో చాణక్యపైనే గోపిచంద్ ఆశలు పెట్టుకున్నాడు.

Read Also : హృతిక్, టైగర్ డ్యాన్స్ విశ్వరూపం..

కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ : శ్రీ చరణ్ పాకాల, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తిరు.