Anil Ravipudi : వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేశ్ మూవీ?
అనిల్ (Anil Ravipudi) మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నాడట.
- Thota Vamshi Kumar
- Published On : February 10, 2026 / 10:49 AM IST
Gossip Garage After Varanasi Mahesh babu doing film with Anil Ravipudi
Anil Ravipudi : ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడట. విక్టరీ వెంకటేశ్‌తో మూవీ చేసేందుకు స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్న అనిల్ సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసి ఈ ఇయర్ ఎండింగ్‌లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారడట. ఆ తర్వాత అనిల్ మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నాడట.
ప్రస్తుతం రాజమౌళితో వారణాసి మూవీ చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. అయితే మహేష్ పార్ట్ మాత్రం ఆరు నెలల ముందే ఫినిష్ అవ్వబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరుగుతున్న అనిల్ రావిపూడితో మూవీ అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Ashika Ranganath : గతవైభవం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆషిక రంగనాథ్.. పల్లెటూరి భామలా..
వెంకటేశ్‌తో సినిమా అయిపోగానే మహేష్‌తో చేసే మూవీని ట్రాక్ ఎక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అనిల్. స్టోరీపై మహేష్‌తో అనిల్ డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే ఓ క్లారిటీ రాబోతున్నట్లుగా చర్చ నడుస్తోంది. అన్నీ కుదరితే దిల్ రాజ్ ప్రొడ్యూసర్‌గా అనిల్, మహేష్ సినిమా రాబోతోందని అంటున్నారు. వారాణాసి లాంటి గ్లోబల్ మూవీ తర్వాత మహేష్ ఓ ప్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్ మూవీ చేయాలనుకోవడం అది అనిల్ డైరెక్షన్‌లో ప్లాన్ చేస్తుండటంతో ఈ ఇద్దరి కాంబోలో మరో హిట్ పక్కా అని ఇప్పటినుంచే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు ఫ్యాన్స్.
