Anna Konidela: ఆ ఫొటోలో ఉన్నది నేను కాదు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా
Anna Konidela: చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోకు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva).
Pawan Kalyan wife Anna Konidela clarifies a photo going viral online
- సుదీర్ఘ చర్చలకు పులిషాట్ప్ పెట్టిన పవన్ సతీమణి
- తీన్ మార్ మూవీలో ఉంది తాను కాదని స్పష్టం
- సినిమాలు, మోడలింగ్ చేయలేదంటూ కామెంట్స్
Anna Konidela: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక పాత ఫోటోపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ పక్కన ఒక విదేశీ మహిళ కూర్చుని ఉన్న ఫోటో చాలా కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
*మాటిచ్చిన అల్లు అర్జున్.. దిల్‌రాజుతో క్రేజీ ప్రాజెక్టు.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఆమెనే అన్నా లెజినోవా(Anna Lezhneva) అని అనుకుంటున్నారు. కానీ, ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని ఆమె తేల్చి చెప్పారు. ఆ ఫోటోలోని వ్యక్తి పేరు డానా మార్క్స్ అని, చాలామంది పొరపాటుగా తన పేరును ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇవ్వడంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా తన వ్యక్తిత్వం గురించి ప్రస్తావిస్తూ.. తాను ఎప్పుడూ మోడల్‌గా కానీ, నటిగా కానీ పనిచేయలేదని అన్నా లెజినోవా పేర్కొన్నారు.
‘తీన్ మార్’ చిత్రంలోని ఒక పాటలో తాను కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తానని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానమిచ్చారు. తమ వివాహానికి ముందు జరిగిన విశేషాలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. వీరిద్దరిలో మొదటగా ఎవరు ప్రేమను వ్యక్తపరిచారనే ప్రశ్నకు అన్నా లెజినోవా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణే స్వయంగా తనకు మొదట ప్రపోజ్ చేశారని వెల్లడించారు. పవన్ సతీమణి ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరవ్వడాన్ని జనసైనికులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Pawan Kalyan wife Anna Lezhneva clarifies a photo going viral online

