Anushka Shetty : స్వీటీ యాక్టింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటుందా..?

సౌత్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు.

Gossip Garage Anushka Shetty want to stay away from acting

సౌత్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. అందం, అభినయంతో తెలుగువారిని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ గర్ల్‌.. రవితేజ, నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌లో నటించింది. సినీ ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టమైన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా సినిమాలు చేయడం తగ్గించింది.

అవకాశాలు లేకనో..లేకపోతే తనకే ఇష్టం లేకనో కానీ బాహుబలి తర్వాత ఆమె పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె నటించిన ఘాటి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే అనుష్క బెంగళూరుకు మకాం మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వాలని భావిస్తుందా అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి.

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ టీజర్ వ‌చ్చేసింది..

ఘాటి సినిమా అనుష్క కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్‌గా చెప్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో గంజాయి తోటల కథతో రూపొందింది. అనుష్క ఇందులో తీవ్రమైన, హింసాత్మక పాత్రలో కనిపించనుందని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లలో ఆమె లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే ఘాటి మూవీ రిలీజ్ రెండుసార్లు వాయిదా పడటంతో పాటు ఆమె నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ఏంటో క్లారిటీ లేకపోవడంతో అనుష్క ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

అరుంధతి, బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌లతో తన నటనా ప్రతిభను చాటుకున్న స్వీటీ..బాహుబలి తర్వాత వెండితెర మీద కనిపించింది అంతంత మాత్రమే. మీడియా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారామె. దీంతో అనుష్క సినీ కెరీర్‌పై డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరులో యోగా టీచర్‌గా తన జీవితాన్ని గడపాలని ఆమె భావిస్తుందా లేక సినిమాలకు బ్రేక్‌ ఇస్తారా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఘాటి సినిమా ఆమె సినీ కెరీర్‌ను డిసైడ్ చేస్తుందని, ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మళ్లీ ఆమె ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. తన సినీ కెరీర్‌పై అనుష్క క్లారిటీ ఇస్తే తప్ప ఈ గాసిప్స్‌కు చెక్ పడే పరిస్థితి కనిపించట్లేదు.