Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ టీజర్ వచ్చేసింది..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంత.

Dulquer Salmaan Kaantha Teaser out now
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లక్కీ భాస్కర్ చిత్రం తరువాత దుల్కర్ నటిస్తున్న స్ట్రయిట్ చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
1950లో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా, సముద్రఖనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మూవీని నిర్మిస్తున్నారు.