Hari Hara Veera Mallu : పురాణాలు, చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ప‌వ‌న్ పాత్ర‌ను క్రియేట్ చేశాం.. ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’.

Hari Hara Veera Mallu : పురాణాలు, చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ప‌వ‌న్ పాత్ర‌ను క్రియేట్ చేశాం.. ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌

Hari Hara Veera Mallu Jyothi Krishna Krish Direction pawan kalyan

Updated On : July 28, 2025 / 12:19 PM IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యం దిశ‌గా దూసుకువెలుతోంది. ఈ చిత్రం విడుద‌లైన త‌రువాత ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ వ‌రుస‌గా మూవీ ప్ర‌మోష‌న‌ల్స్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ప‌వ‌న్ పాత్ర‌ను ఎలా డిజైన్ చేశారో వెల్ల‌డించారు. ప‌వ‌న్ పాత్ర‌ను వేదాల‌ను, పురాణాల‌ను బేస్ చేసుకుని డిజైన్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు హిందూ దేవాల‌యాల‌ను ధ్వంసం చేస్తున్న‌ప్పుడు వేదాలు చ‌దువుకున్న వీరమ‌ల్లు ఒక వేద పండితుడిగా మారి, వాటిని నాశ‌నం చేయ‌కుండా ఎలా అడ్డుకుంటాడు. వీర‌మ‌ల్లు చిన్నప్ప‌టి నుంచి గుడిలో పెర‌గ‌డంతో వేద జ్ఞానాన్ని పొంది శ‌క్తివంతమైన వ్య‌క్తిగా ఎదిగాడ‌ని చెప్పారు.

Indhra Ram : భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్న చౌర్య‌పాఠం హీరో ఇంద్ర‌రామ్..

వీర‌మ‌ల్లు త‌న వేద జ్ఞానాన్ని ఆధారంగా పంచ భూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం అవ‌గ‌తం చేసుకుని ధ‌ర్మ‌సంబంధ‌మైన జీవన విధానాన్ని నిర్మించ‌టంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. ఇందుకు సంబంధించి ప్రతీ సీన్‌లో ధ‌ర్మం క‌నిపించేలా డిజైన్ చేశాం. గుల్ఫ‌మ్ ఖాన్ (క‌బీర్ దుహాన్ సింగ్‌)ను కొండ‌పై జ‌రిగే ప్ర‌మాదం నుంచి కాపాడుతాడు, అలాగే యాగం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల‌ని చూసే వారి నుంచి యాగానికి ఏమీ కాకుండా ర‌క్షించి వ‌రుణ దేవుడు క‌రుణించేలా చేసి వ‌ర్షం కురిసేలా చేస్తాడు, అలాగే రాత్రి స‌మ‌యంలో తోడేళ్లు దాడి చేయ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వాటితో మాన‌సిక‌మైన సంభాష‌ణ చేసి ఎవ‌రికీ ఏమీ కాకుండా చూస్తాడు. ఇవ‌న్నీ వీర‌మ‌ల్లుకి వేద త‌త్వాల నుంచి వచ్చిన ప్రేర‌ణ అని అర్థ‌మ‌వుతుందని చెప్పాడు జ్యోతి కృష్ణ‌.

వీర‌మ‌ల్లు త‌న ప్ర‌యాణాన్ని గోల్కొండ నుంచి ఢిల్లీ వ‌ర‌కు సాగించారు. ద‌క్షిణ భార‌తం నుంచి ఉత్త‌ర భార‌తం వ‌ర‌కు సాగిన ఈ ప్ర‌యాణంలో క‌థానాయ‌కుడు వేద తత్వాల‌తో ప్ర‌జ‌ల‌కు మంచి ప‌నుల‌ను చేయ‌టానికి గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇతిహాసాన్ని, చరిత్ర‌ను మిళితం చేసి వీర‌మ‌ల్లు అనే పాత్ర స‌నాధర్మాన్ని ఎలా ప‌రిర‌క్షించాడనే విష‌యాన్ని చెప్పాం. అని జ్యోతి కృష్ణ తెలిపారు.