Indhra Ram : భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్న చౌర్యపాఠం హీరో ఇంద్రరామ్..
ఇంద్రరామ్ ఇటీవల చౌర్య పాఠం సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు.

chaurya paatham hero indhra ram coming with huge budget film
ఇంద్రరామ్ ఇటీవల చౌర్య పాఠం సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. హేస్ట్ థ్రిల్లర్ గా త్రినాథ రావు నక్కిన నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పెద్ద విజయమే దక్కించుకుంది.
అమెజాన్ ప్రైమ్ లో చౌర్య పాఠం సినిమా దాదాపు 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టింది. చౌర్య పాఠం తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఇంద్రరామ్ త్వరలో భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు.
ఇప్పటికే కథ ఓకే అయిందని, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని సమాచారం. ఓ కొత్త తరహా కథాంశంతో ఇంద్రరామ్ రెండో సినిమా రానుంది.