Tollywood : ఒరిజినల్ Vs డబ్బింగ్.. థియేటర్స్ వార్…!
టాలీవుడ్‌లో (Tollywood) ఒరిజినల్ వర్సెస్ డబ్బింగ్ మూవీ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది
- Thota Vamshi Kumar
- Updated on- August 25, 2026 / 08:27 AM IST
Gossip Garage In Tollywood ORIGINAL VS DUBBING war
Tollywood : టాలీవుడ్‌లో ఒరిజినల్ వర్సెస్ డబ్బింగ్ మూవీ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ఇరుముడి మూవీ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇంతలోనే యష్ నటించిన టాక్సిక్ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. దీంతో థియేటర్ల కేటాయింపుపై కొత్త చర్చ మొదలైంది. టాక్సిక్ కోసం, ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఇరుముడి థియేటర్లలో కొన్నింటిని కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
నైజాం ఏరియాలో ఇరుముడి రెండో వారం థియేటర్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్‌పై కూడా భారీ అంచనాలు ఉండటంతో థియేటర్ల కోసం పోటీ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. తెలుగు సినిమా సక్సెస్‌లో ఉన్నప్పుడు కూడా థియేటర్లు ఇవ్వకపోతే ఎలా.? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక తెలుగు సినిమా మంచి టాక్‌తో నడుస్తూ, కలెక్షన్లు తెస్తున్న సమయంలో పెద్ద సినిమా వస్తోందనే కారణంతో స్క్రీన్స్ తగ్గించడం సరైందేనా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
Priya Bhavani Shankar : ఇరుముడి సక్సెస్ మీట్‌లో ప్రియా భవానీ శంకర్.. ఫోటోలు
మరోవైపు.. యష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్, టాక్సిక్‌పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడం సహజమేనని మరో వర్గం అంటోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాకు సరైన విడుదల ఇవ్వాల్సిన బాధ్యత కూడా డిస్ట్రిబ్యూటర్స్‌పై ఉంటుందనే వాదన వినిపిస్తోంది. దీంతో ఇది కేవలం ఇరుముడి వర్సెస్ టాక్సిక్ పోటీ మాత్రమే కాదు..ఒరిజినల్ తెలుగు సినిమా వర్సెస్ డబ్బింగ్ మూవీగా పెద్ద చర్చగా మారుతోంది.
మొత్తానికి ఆగస్ట్ 26 నుంచి థియేటర్ల దగ్గర అసలైన వార్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరుముడి బలమైన టాక్‌తో థియేటర్లను నిలబెట్టుకుంటుందా.? లేక టాక్సిక్ భారీ విడుదల ముందు స్క్రీన్స్ కోల్పోతుందా.? ఈ థియేటర్ వార్ ఎటుదారితీస్తుందో చూడాలి మరి.
