ఉస్తాద్ భగత్ సింగ్.. డైరెక్టర్ ముందు పవన్ కల్యాణ్ పెట్టిన డిమాండ్‌ ఏంటి?

హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Gossip Garage Ustaad Bhagat Singh (Photo Credit : Google)

Gossip Garage : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. గబ్బర్‌సింగ్ కాంబో కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయ్. ఐతే ఇప్పుడీ మూవీకి సంబంధించి.. ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ను పిలిపించుకొని మరీ.. అతని ముందు పవన్ కల్యాణ్‌ ఓ డిమాండ్‌ పెట్టారట. ఇంతకీ ఏంటది.. ఉస్తాద్‌ వస్తాడా రాడా.. పవన్ చెప్పిందేంటి..

ఎన్నికల్లో విజయం.. ఆ తర్వాత డిప్యూటీ సీఎం… పవన్‌ పొజిషన్‌తో హ్యాపీగానే అనిపిస్తున్నా.. పవర్‌స్టార్ నుంచి సినిమాలు లేకపోవడం తెలియని వెలితిలా మిగిలిపోతోంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ ఎక్కడికి వెళ్లినా.. మూవీ అప్డేట్స్‌ అడుగుతున్నారు ఫ్యాన్స్. అందుకే ! ఒకేసారి డేట్స్ ఇచ్చి.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ మూవీ గురించి ఇప్పుడో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. మూవీ స్క్రిప్ట్​లో దర్శకుడు హరీశ్ శంకర్ మార్పులు చేస్తున్నాడని తెలుస్తోంది.

పవన్ చెప్పారనే.. హరీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌. కొన్నిరోజుల కింద హరీష్‌ను పిలిపించిన పవన్.. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారట. దీంతో హరీష్‌ ఇప్పుడు ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ లాస్ట్‌ వీక్‌లో సినిమా స్టార్ట్ చేద్దామని.. డైలాగ్ వెర్షన్‌తో ఫుల్‌ స్క్రిప్ట్ రెడీ చేయాలని పవన్‌ డెడ్‌లైన్‌ పెట్టాడట. అలా చేస్తే ఫుల్‌ డేట్స్ ఇచ్చి.. షూట్ రీస్టార్ట్ చేస్తానని చెప్పినట్లు టాక్. దీంతో బౌండెడ్ స్క్రిప్ట్ కోసం డైరెక్టర్‌ హరీష్ శంకర్‌ కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీస్టార్ట్ అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ ఎన్నికల ముందే రావాల్సింది. ఐతే ప్రచారంలో పవన్ బిజీగా ఉండడంతో.. ఆలస్యమైంది. ఎన్నికల్లో జనసేన ఘనవిజయం సాధించడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని పవన్ సూచించారు. పవన్ పాత్రలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో కొత్త స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Also Read : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంట.. కథ కూడా చెప్పేశారు.. వారంలో అనౌన్స్..