Gossip Garage once again Ramcharan NTR combination
ఆర్ఆర్‌ఆర్ కాంబినేషన్ ను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నామా? రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబో యాక్షన్ ఫ్యాన్స్ ని ఫిదా చేయబోతుందా? ఇద్దరూ చేసే ఫైట్ ఆ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో 5 నిమిషాల హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నాడని సినీవర్గాల్లో హాట్ హాట్ గా విన్పిస్తున్న గాసిప్. బుచ్చిబాబు మార్క్ రా, రస్టిక్ యాక్షన్ స్టైల్‌లో ఈ సీన్ ఒక ఊరి ఫెస్టివల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేశారట. రామ్ చరణ్, తన సిగ్నేచర్ ఇంటెన్సిటీతో ఒక గ్యాంగ్‌ను గట్టిగా ఎదుర్కొంటూ ఫైట్ చేస్తుంటే.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చే ఎన్టీఆర్ తన డైనమిక్ తో ఎదురీది మరో గ్యాంగ్‌ను చితక్కొడతాడట. ఈ 5 నిమిషాల్లో బుచ్చిబాబు స్టైల్‌లో గ్రిట్టీ, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఫైట్ ఉంటుందట.
రామ్ చరణ్ ఒక విలన్‌ను గోడకు తోసి కొట్టే స్లో-మోషన్ షాట్, ఎన్టీఆర్ గుండెల్లో తన్నే ఫ్లెక్సిబుల్ స్టంట్‌తో స్క్రీన్ ఫైర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సీన్లో రేగే దుమ్ము, రక్తం, జానపద బీట్స్ మధ్య ఈ యాక్షన్ ఒక సోదర బంధం లేదా ఊరి గౌరవం కోసం జరిగే గొడవగా ఉండబోతుందంట. చివర్లో ఇద్దరూ ఒకరి వెన్ను ఒకరు అడ్డుకుని, ఒక ఎమోషనల్ డైలాగ్‌తో సీన్ ప్రీ క్లైమాక్స్‌కి తీసుకెళ్తారన్న టాక్ సినీ గాసిప్స్ లో వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్‌లో కనువిందు చేసిన రామ్‌చరణ్-ఎన్టీఆర్ కాంబోను ఫ్యాన్స్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ త్వరలోనే రాబోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ సీన్ చూడాలంటే మాత్రం పెద్ది సినిమా విడుదలైన తర్వాతే అన్న సంగతిని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. మరి పెద్దిలో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబో ఏవిధంగా ఉండబోతుందో చూడాలి.