Gossip Garage Pawan Kalyan HOOK STEP in Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే వపన్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్‌గా నడుస్తుందట. ఈ మూవీని ఏప్రిల్ 23 లేదా 24న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. ఈ రెండు డేట్స్‌లో ఏదో ఒక తేదీ మాత్రం కన్ఫామ్ అంటున్నారు. అయితే రిలీజ్ డేట్‌తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్‌పై మరో టాక్ కూడా వినిపిస్తుంది.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్స్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చిరు హుక్ స్టెప్స్‌కు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో అయితే చిరు హుక్ స్టెప్స్‌పై రీల్స్ ఫుల్ లోడెడ్ అన్నట్లుగా ఉంది.
Sreemukhi : 2016 ట్రెండ్.. ఫోటోలు షేర్ చేసిన శ్రీముఖి.. వామ్మో ఎంతగా మారిపోయిందో..
ఇలాంటి హుక్ స్టెప్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కూడా వేయిస్తున్నట్లు టాక్. దీని కోసం ఓ సాంగ్‌ను కూడా రెడీ చేస్తున్నారట. హరీష్ శంకర్, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పవన్ హుక్ స్టెప్ కోసం స్పెషల్ సాంగ్‌ను తయారు చేస్తున్నారట. మరో సాంగ్ కోసం వర్క్ అంటూ హరీశ్ శంకర్, చంద్రబోస్ పిక్స్ రిలీజ్ చేశారు. అయితే పవన్‌తో హుక్ స్టెప్ సాంగ్‌కే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదే నిజం అయితే పవన్‌తో హుక్ స్టెప్స్‌కు థియేటర్లు రచ్చరచ్చే అంటున్నారు ఫ్యాన్స్.