Peddi : పెద్ది టీం సంచలన నిర్ణయం?
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంతో వస్తున్న పెద్ది (Peddi) మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- May 22, 2026 / 01:03 PM IST
Gossip Garage PEDDI NO TICKET HIKE
Peddi : రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంతో వస్తున్న పెద్ది మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కాబోతున్న పెద్ది మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. పెద్ది టికెట్ రేట్ల పెంపుపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సాధారణంగా రేట్లు పెంచడం అనేది సాధారణ ట్రెండ్. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే టికెట్ రేట్లు పెంచితే ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇటీవల కొన్ని సినిమాలు హైటికెట్ రేట్ల వల్లే ఓపెనింగ్స్‌లో వెనకబడ్డాయని చెబుతున్నారు. అందుకే టికెట్ రేట్స్ విషయంలో పెద్ది టీమ్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. భారీ ఖర్చులు ఉన్నప్పటికీ, టికెట్ రేట్లు పెంచడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికే ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
టికెట్ రేట్ల పెంపును పక్కన పెట్టి, ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్ చేసి ఆక్యుపెన్సీ పెంచే స్ట్రాటజీపై ఫోకస్ పెట్టారట పెద్ది నిర్మాతలు. సాధారణ టికెట్ ధరలతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవచ్చుననే నమ్మకంతో ఉన్నారట. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్‌లోనే భారీ కలెక్షన్స్ సాధించాలంటే, ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సాధ్యం. అందుకే మొదటి వారంలో ఆడియన్స్ థియేటర్స్‌కు రావాలంటే టికెట్ల రేట్లు అందుబాటులో ఉంటేనే వస్తారని అంచనా వేస్తున్నారట. అయితే పెద్ది టికెట్ రేట్స్ పెంపుపై ఇప్పటికైతే ఏ డెసిషన్ తీసుకోకపోయినా..ఇంటర్నల్‌గా సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్లు టాక్.
