Gossip Garage sankranthi movies facing Screen sharing problems
Tollywood : టాలీవుడ్‌లో సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారింది. ఒకే ఫెస్టివల్ విండోలో ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి మూవీస్ రిలీజ్ వరుస పెట్టి విడుదల అయ్యాయి.
దీంతో థియేటర్లు అందుబాటులో లేకుండా పోయాయి. సింగిల్ స్కీన్ థియేటర్లు అయితే ఒకే సినిమాకు కమిట్ అయి..సక్సెస్ టాక్ తెచ్చుకున్న మరో మూవీ షో వేయలేక ఇబ్బంది పడుతున్నాయట. ఆడియన్స్ మాత్రం వరుస పెట్టి అన్ని మూవీస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. కానీ అన్ని మల్టీఫ్లెక్స్‌లలో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్రదర్శించట్లేదట. దీనికి థియేటర్లు, స్క్రీన్ల కొరతే కారణమంటున్నారు.
Sridevi : కోర్ట్ శ్రీదేవి సంక్రాంతి స్పెషల్ ఫొటోలు.. పొలాల్లో ఎంజాయ్ చేస్తూ..
డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు తమ సినిమాలను ఆడియన్స్ చూపించేందుకు..సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నారట. స్క్రీన్ షేరింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది. ఒక థియేటర్‌లో తమ సినిమాకు షో లేకపోతే, వేరే సినిమా షోకు బుకింగ్స్ లేకపోతే ఆ టైమ్‌లో తమ మూవీ రన్ చేసేలా అడ్జస్ట్ మెంట్ చేసుకుంటున్నారట.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సీన్ ఉందట. ఒకరి షో టైమ్‌లో డిమాండ్‌ను బట్టి మరొకరి సినిమాను రన్ చేస్తూ, కోఆర్డినేషన్‌తో ఇష్యూస్ రాకుండా కేర్ తీసుకుంటున్నారట. అయితే ఒకేసారి అన్ని సినిమాలు వరుస పెట్టి రిలీజ్‌లు చేయడమే స్కీన్ల షార్టేజ్‌కు రీజన్ అంటున్నారు. దీంతో ఈ సారి సంక్రాంతి కాస్త ప్రేక్షకులకు సినిమాల పండగ అయితే.. నిర్మాతలు-థియేటర్ ఓనర్లకు స్క్రీన్ల పండగ కాదు..దులుగా ‘సర్దుబాటు పండుగగా మారిందంటున్నారు.