Magic : విజయ్ దేవరకొండ సినిమా కంటే ముందు చిన్న సినిమా తీసుకొస్తున్న డైరెక్టర్..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమా తెరకెక్కింది.

Gowtam Tinnanuri Magic Movie Releasing Date Announced

Magic : డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో VD12 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ లో రానుంది. అయితే ఈ లోపే గౌతమ్ డైరెక్ట్ చేసిన ఓ చిన్న సినిమా రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమా తెరకెక్కింది. చాలా మంది కొత్త నటీనటులతో ఈ సినిమాని ఒక మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కించారు.

Also See : Akhanda 2 : కూతుళ్ళ ఆధ్వర్యంలో బాలయ్య అఖండ 2 మూవీ ఓపెనింగ్.. ఫొటోలు చూశారా?

ఇప్పటికే షూటింగ్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుంటుంది ‘మ్యాజిక్‌’ సినిమా. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నేడు అనిరుధ్ పుట్టిన రోజూ సందర్భంగా మ్యాజిక్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా మ్యాజిక్ సినిమా డిసెంబర్ 21న థియేటర్స్ లో విడుదల కానుంది అని ప్రకటించారు మూవీ యూనిట్.

తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను రెడీ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ మ్యాజిక్ కథ తిరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.