Grand Kakinada hotel gifted Teddy Bear to Samantha Post viral
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా స్టార్‌డమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ అండ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి (Kushi) సినిమాలో నటిస్తుంది. సిటాడెల్ షూటింగ్ ఆల్రెడీ పూర్తీ చేసుకోగా తాజాగా ఖుషి షూటింగ్ కి కూడా గుమ్మడి కాయ కొట్టారు. ఈ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కాకినాడ, ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో జరిగింది.
Dil Raju : దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు చూశారా..
దీంతో సమంత అక్కడ ‘గ్రాండ్ కాకినాడ’ హోటల్ లో స్టే చేసింది. ఆ హోటల్ మేనేజ్మెంట్ సామ్ కి వెళ్ళేటప్పుడు ఒక టెడ్డీబేర్ ని బహుమతిగా ఇచ్చారు. ఆ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది. “నాకు ఒక ఫ్రెండ్ కావాలని ఆలోచించి గ్రాండ్ కాకినాడ నాకు ఈ బహుమతి ఇచ్చింది. థాంక్యూ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సమంత ఇంకా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోలేదని తెలుస్తుంది.
Grand Kakinada hotel gifted Teddy Bear to Samantha Post viral
ఈమద్యలో షూటింగ్స్ పాల్గొంటూనే పలు థెరపీలు తీసుకుంటూ వచ్చిన సమంత.. ఇప్పుడు సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి అమెరికాకు చికిత్స కోసం వెళ్ళబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మొదలుపెట్టిన షూటింగ్స్ పూర్తి చేసిన సమంత.. ప్లానింగ్ లో ఉన్న సినిమాల నుంచి తప్పుకుందట. ఈ క్రమంలోనే తను తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇక వార్త తెలియడంతో సమంత అభిమానులు.. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాతే సినిమాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. సిటాడెల్ కూడా అదే నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది.