Green Power Ranger Jason David Frank : గ్రీన్ పవర్ రేంజర్ కన్నుమూశాడు..

జాసన్ డేవిడ్ ఫ్రాంక్.. 1990లో ప్రసారమైన పిల్లల కార్టూన్ సిరీస్ "మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్"లో గ్రీన్ పవర్ రేంజర్ టామీ ఆలివర్ పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక 49 ఏళ్ళ 'జాసన్ డేవిడ్ ఫ్రాంక్' మరణించినట్లు ఆదివారం ఒక ప్రకటన బయటకి వచ్చింది. డేవిడ్ ఫ్రాంక్ మేనేజర్ 'జస్టిన్ హంట్'.. ఫ్రాంక్ కన్నుమూసినట్లు వెల్లడించింది. కాగా అతని మరణానికి గల కారణాలు గాని...

Green Power Ranger Jason David Frank : గ్రీన్ పవర్ రేంజర్ కన్నుమూశాడు..

Green Power Ranger Jason David Frank passed away

Updated On : November 21, 2022 / 12:53 PM IST

Green Power Ranger Jason David Frank : జాసన్ డేవిడ్ ఫ్రాంక్.. 1990లో ప్రసారమైన పిల్లల కార్టూన్ సిరీస్ “మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్”లో గ్రీన్ పవర్ రేంజర్ టామీ ఆలివర్ పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ పవర్ రేంజర్స్ సిరీస్ కి ఇండియాలోను ఆదరణ కలగడంతో.. అప్పటి జెటక్స్ ఛానల్ ఈ సిరీస్ ని డబ్బింగ్ చేసి భారతీయ భాషలోనూ అనువదించి ప్రసారం చేసేవారు.

Pragya Jaiswal : బ్రైట్ లైట్ వెలుగుల్లో ప్రగ్యా జైస్వాల్ బ్యూటీ..

ఇక 49 ఏళ్ళ ‘జాసన్ డేవిడ్ ఫ్రాంక్’ మరణించినట్లు ఆదివారం ఒక ప్రకటన బయటకి వచ్చింది. డేవిడ్ ఫ్రాంక్ మేనేజర్ ‘జస్టిన్ హంట్’.. ఫ్రాంక్ కన్నుమూసినట్లు వెల్లడించింది. కాగా అతని మరణానికి గల కారణాలు గాని, అతను ఎప్పుడు మరణించాడు అనే విషయాన్ని గాని ఆమె తెలియజేయలేదు. కానీ అతన్ని కోల్పోయిన విషాదాన్ని నుంచి కోలుకోడానికి.. కుటుంబం మరియు స్నేహితులకు కొంచెం ప్రైవసీ ఇవ్వాలంటూ కోరింది.

“మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్”లో ఫ్రాంక్‌తో కలిసి నటించిన బ్లాక్ పవర్ రేంజర్ వాల్టర్ ఇమ్మాన్యుయేల్ జోన్స్ ఈ వార్త తెలుసుకోగా.. తాను నమ్మలేకపోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. “మా పవర్ రేంజర్ కుటుంబంలోని మరొక సభ్యుడిని కోల్పోయినందుకు నాకు బాధగా ఉంది” అని జోన్స్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ సిరీస్ లో ఎల్లో పవర్ రేంజర్‌గా నటించిన థుయ్ ట్రాంగ్, 2001లో 27 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు.