GST on Movie Tickets
GST on Movie Tickets : తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబుల ప్రకారం సామాన్యులకు చాలా వరకు నిత్యావసరాలు రేట్లు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
ఈ క్రమంలో సినీ పరిశ్రమలో సినిమా టికెట్లకు కూడా జీఎస్టీ రేట్లు తగ్గించారు. గతంలో 100 రూపాయలు, అంతకంటే తక్కువ రేటు ఉన్న టికెట్స్ కు 12 శాతం జీఎస్టీ ఉండేది. 100 కు పైగా ఉండే టికెట్ రేట్లకు 18 శాతం ఉండేది. అంటే మల్టిప్లెక్స్ లలో 18 శాతం జీఎస్టీ ఉండగా, సింగిల్ స్క్రీన్స్ లో 12 శాతం ఉండేది.
Also Read : Coolie Ott Release : రజినీకాంత్ కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?
ఇప్పుడు కొత్త జీఎస్టీ విధానం ప్రకారం 12 శాతం శ్లాబ్ ని 5 శాతానికి తగ్గించారు. అంటే 100 రూపాయల లోపు ఉన్న టికెట్స్ కి జీఎస్టీ భారం తగ్గనుంది. 100 పైన అంటే మల్టిప్లెక్స్ లలో మాత్రం అదే 18 శాతం కంటిన్యూ చేస్తున్నారు.
అయితే థియేటర్స్ వ్యవస్థ ఈ జీఎస్టీని తమ రేట్లకు అనుగుణంగా రౌండ్ ఫిగర్ చేసి 150, 200, 300, 400 రూపాయలకు టికెట్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు జీఎస్టీ తగ్గింది కాబట్టి సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లు తగ్గిస్తారా లేదా ఎలాంటి మార్పులు లేకుండా టికెట్ రేటు పెంచి రౌండ్ ఫిగర్ చేసి మళ్ళీ పాత రేట్లకే అమ్ముతారా చూడాలి. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త జీఎస్టీ శ్లాబ్ సింగిల్ స్క్రీన్స్ కు మాత్రం వరం. థియేటర్స్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తే ప్రేక్షకులకు కూడా కొంత టికెట్ రేటు తగ్గే అవకాశం ఉంది.
Also Read : Pawan Kalyan : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG దూకుడు.. పుష్ప, దేవర, సలార్ రికార్డ్ లను బద్దలుకొట్టి..