Tamannaah : నా తమన్నాతో తిరుగుతున్నావు.. భలే బుద్ధి చెప్పావు.. విజయ్ వర్మ ఫ్రెండ్ వైరల్ కామెంట్స్!

తమన్నా, విజయ్ వర్మ ప్రేమ ఇటీవల బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ వర్మ స్నేహితుడు.. నా తమన్నా అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు. అసలు కథ ఏంటి?

Gulshan Devaiah viral comments Tamannaah and vijay varma relation

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma) ప్రేమలో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తమన్నా, విజయ్ ముద్దు పెట్టుకుంటున్న ఒక వీడియో బయటకి రావడంతో వీరిద్దరి ప్రేమ భాగవతం బయట పడింది. ఆ తరువాత కూడా వీరిద్దరూ బాలీవుడ్ లోని పలు ఫంక్షన్స్ తో పాటు ముంబై వీధుల్లో కూడా చెట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తుండడంతో బి-టౌన్ లో హాట్ టాపిక్ అయ్యిపోయారు. తాజాగా ఈ విషయం గురించి బాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్స్ అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి.

Tamannaah : ముంబై వీధుల్లో ప్రియుడితో చక్కర్లు కొడుతున్న తమన్నా..

విజయ్ వర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘దహాద్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ ని విజయ్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాని కింద తన స్నేహితుడు మరియు నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) వైరల్ కామెంట్స్ చేశాడు. “నా తమన్నాతో నువ్వు తిరుగుతూ నాకు సరైన బుద్ధి చెప్పావు. ఇంక నా పరువు తియ్యనందుకు థాంక్యూ. లేకుంటే ఏమి జరిగేదో. హే రామ్” అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుల్షన్ ఈ కామెంట్స్ విజయ్ ని ఆటపట్టించడానికి చేశాడు అంటున్నారు కొంతమంది నెటిజెన్లు.

Gulshan Devaiah viral comments Tamannaah and vijay varma relation

కాగా ఈ జంట ఇటీవల డిన్నర్ నైట్ కి ఒక రెస్టారెంట్ కి వచ్చి కెమెరా లెన్స్ కి దొరికారు. ఇద్దరు కలిసి ముంబై లోని ఒక హోటల్ డిన్నర్ చేసిన తరువాత ఒకే కారులో వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా వీరిద్దరికి లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) సిరీస్ వల్ల పరిచయం అయ్యినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో తమన్నా అండ్ విజయ్ కలిసి నటిస్తున్నారని సమాచారం.