Gunasekhar
Gunasekhar : దర్శకుడు గుణశేఖర్ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. గత కొంతకాలంగా పరాజయాలు ఉన్నా సినిమాలు చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యుఫొరియా సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.(Gunasekhar)
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చూడాలని ఉంది సినిమా వచ్చింది. 1998లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమాలో కొన్ని రైల్వే స్టేషన్స్ సీన్స్ ఉన్నాయి. అయితే అవన్నీ రియల్ రైల్వే స్టేషన్ లో తీసినవి అని గుణశేఖర్ అప్పటి సంగతులను తెలిపారు.
Also Read : Keerthi Bhat : ఎంగేజ్మెంట్, లివ్ ఇన్ రిలేషన్.. ఇప్పుడు బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ భామ..
గుణశేఖర్ మాట్లాడుతూ.. చూడాలని ఉంది సినిమాలో మొదటి నుంచి చిరంజీవిని డిఫరెంట్ గానే చూపించాలి అనుకున్నా. నాకు రైల్వే స్టేషన్స్ అంటే ఇష్టం. నేను రియల్ స్టేషన్ నాంపల్లి లో షూటింగ్ పెట్టాను. నీకేమైనా పిచ్చా అని నిర్మాత తిట్టారు. మెగాస్టార్ ని పెట్టుకొని నాంపల్లిలో ఎలా షూటింగ్ చేస్తావ్ అన్నా కూడా నేను పట్టుబట్టాను. దాంతో పోలీస్ బందోబస్త్ తో షూటింగ్ సెట్ చేసారు. పొద్దున్నే 7 గంటలకు పర్మిషన్ ఇచ్చారు. చిరంజీవి గారు షార్ప్ 7కి వచ్చారు.
నేను సీన్ పేపర్ పట్టుకొని వెళ్ళాను. మొత్తం చెప్పాను. నవలలా ఉంది ఇది ఇలా తీస్తే అదిరిపోతుంది అన్నారు చిరంజీవి. ఇక్కడే చేస్తున్నావా ఈ సీన్ అంతా అని అడిగితే అవును అని చెప్పాను. కెమెరా మెన్ చోటా కె నాయుడు ఆ రోజు గొడ్డులా కష్టపడ్డాడు. నిర్మాత అశ్వినీదత్ కూడా కర్ర పట్టుకొని చుట్టూ జనాల్ని కంట్రోల్ చేసారు. ఎడిటింగ్ లో ఆ సీన్స్ మొత్తం 15 నిమిషాల వస్తే ఆ స్టేషన్ సీన్స్ 9 నిమిషాలకు కట్ చేశాను. చిరంజీవి మీద ప్రయోగం అవుతుందా అని అనుకున్నారు అంతా. అంత మెలోడీగా ఉంటే జనాలు, మాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఎంజాయ్ చేస్తారా అనుకున్నారు అంతా. అర్ధరాత్రి షో పడ్డాక అశ్విని దత్ ఫోన్ చేసి అదిరిపోయింది. ఆ సీన్ హైలెట్ అంటున్నారు, కొత్తగా చూపించారు మెగాస్టార్ ని అన్నారని తెలిపారు.
Also Read : Anchor Jhansi : చిరంజీవికి యాంకర్ ఝాన్సీ కౌంటర్ ఇచ్చిందా? వరుస పోస్టులు వైరల్..
గుణశేఖర్ చూడాలని ఉంది సినిమాలో చెప్పిన రైల్వే సీన్ ఇదే..