Guntur Kaaram : ‘గుంటూరు కారం’ థియేటర్స్ వద్ద మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజైన 'గుంటూరు కారం'. మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

Guntur Kaaram grand release Mahesh Babu Fans celebrations at theaters

Guntur Kaaram : మహేష్ బాబు పక్కా మాస్ రోల్‌ లో కనిపిస్తూ చేసిన సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ చితం రిలీజ్ అయ్యింది. ప్రీమియర్, బెనిఫిట్ షోలతో కలిపి మొదటి రోజు ఓపెనింగ్స్ తో మహేష్ రికార్డు సెట్ చేయబోతున్నారు.

ఇక మహేష్ సినిమా రిలీజ్ అంటే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. విజయవాడ థియేటర్ల వద్ద మహేష్ బాబు కటౌట్ కి కొబ్బరికాయ కొట్టి, పాలాభిషేకం చేస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. బెజవాడలోని లేడీ ఫ్యాన్స్ అయితే డాన్స్ లు వేస్తూ తెగ హంగామా చేశారు. ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ రివ్యూ.. పండక్కి ఘాటు ఎక్కించి.. ఎమోషన్‌తో కన్నీళ్లు తెప్పించిన బాబు..

అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా గుంటూరు కారం సందడి జోరుగా కనిపిస్తుంది. ఏలూరు, భీమవరంలో బాణాసంచా కలుస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో మహేష్ బాబు చిత్రపటానికి పాలభిషేకం చేసిన ఫ్యాన్స్.. గుంటూరు నుండి తెచ్చిన 20 కేజీల ఎండిమిరపకాయల దండ వేసి తీన్మార్, బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. నైజంలో కూడా ఎక్కడ చూసిన గుంటూరు కారం ఘాటు కనిపిస్తుంది.

ఇక మూవీ విషయానికి వస్తే.. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు. మహేష్ తన స్టైల్ స్వాగ్ తో గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి బాగా ఘాటు ఎక్కించి ఎమోషన్స్ తో కన్నీళ్లు తెప్పించాడని చెబుతున్నారు. పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని వెల్లడిస్తున్నారు. ఇక డాన్స్‌ల్లో మహేష్ లో ఇప్పటివరకు చూడని ఎనర్జీ ఈ మూవీలో కనిపిస్తుందట. సినిమాలో మహేష్, శ్రీలీల వేసే స్టెప్పులు ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయని చెబుతున్నారు.