Guntur Kaaram
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.
Anupama Parameswaran : అన్నయ్య అంటున్న అనుపమ పరమేశ్వరన్.. అలా పిలవద్దంటున్న రవితేజ..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్‌తో వెల్లడించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటివారంలో రూ.212 కోట్లు వసూలు చేసి దుమ్ము రేపింది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం.. మాస్ అవతారంలో మహేష్ ఆట,పాట చూసి అభిమానులు పండగ చేసుకున్నారు.
వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు)ను తల్లి వసుంధర (రమ్యకృష్ణ) చిన్నతనంలో వదిలేసి వెళ్తుంది. మరో వ్యక్తి (రావు రమేష్)ను పెళ్లి చేసుకుంటుంది. కొడుకు నుండి వసుంధరను ఆమె తండ్రి వెంకటస్వామి (ప్రకాశ్ రాజ్) దూరం చేస్తాడు. పైగా తల్లితో సంబంధం లేనట్లు బాండ్‌పై సంతకం చేయమంటాడు. అసలు తల్లి తనను ఎందుకు విడిచివెళ్లింది? తాత కోరిక ప్రకారం రమణ బాండ్‌పై సంతకం చేస్తాడా? తిరిగి రమణ తల్లి ప్రేమను పొందుతాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం గుంటూరు కారం. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో కూడా గుంటూరు కారం ఘాటు చూపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.