×
Ad

Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్‌ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం క్యారెక్టర్ తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాక్ట్రెస్ జ్యోతి రాయ్ టాలీవుడ్ డైరెక్టర్‌ని పెళ్లాడబోతుంది.

  • Published On : September 29, 2023 / 06:32 PM IST

Guppedantha Manasu actress Jyothi Rai getting married tollywood director Suku Purvaj

Jyothi Rai : తెలుగు ఆడియన్స్ సినిమాలతో పాటు సీరియల్స్ ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తుంటారు. ఇక సినిమాల్లో నటించే స్టార్స్ ని ఎలా అభిమానిస్తుంటారో సీరియల్ స్టార్స్ ని కూడా అలానే ఫాలో అవుతుంటారు. ఇక ఈమధ్య గుప్పెడంత మనసు (Guppedantha Manasu) అనే సీరియల్ కి మంచి ప్రేక్షకాదరణ వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి నచ్చేలా లవ్ ట్రాక్ ని కూడా పెట్టి ఇంటరెస్టింగ్ గా నడిపిస్తున్నారు.

Operation Valentine : లాస్ట్ మూవీ డిజాస్టర్.. అయినా రికార్డు స్థాయిలో వరుణ్ తేజ్ కొత్త మూవీ బిజినెస్..

ఈ సీరియల్ చూసేవారికి జగతి మేడం క్యారెక్టర్ బాగా పరిచయమే. సీరియల్ లో హీరోకి తల్లిగా ప్రధాన పాత్ర చేస్తున్న జగతి మేడం అసలు పేరు జ్యోతి రాయ్. కన్నడ భామ అయిన జ్యోతి రాయ్ తెలుగు, కన్నడ సీరియల్స్ చేస్తూ వస్తుంది. కాగా ఈమె ఇప్పుడు ఒక టాలీవుడ్ డైరెక్టర్ ని పెళ్లాడబోతుంది. మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఒక గుర్తింపు సంపాదించుకున్న ‘సుకు పూర్వాజ్’ అలియాస్ సురేష్ కుమార్.. తాజాగా ‘ఏ మాస్టర్ పీస్’ (A Masterpiece) అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Allu Arjun : లండన్‌లో అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డితో..

ఈ దర్శకుడినే జ్యోతి రాయ్ పెళ్లాడబోతుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల సుకు పూర్వాజ్, జ్యోతి రాయ్ తో ఉన్న ఫోటో షేర్ చేసి.. త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతాను అని కూడా తెలియజేశాడు. తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. మరి నిశ్చితార్థం వేడుక ఆల్రెడీ అయ్యిపోయిందా..? లేదా త్వరలో చేసుకోబోతున్నారా..? అనేది క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పెళ్లి ఎప్పుడు అనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరికి ఇది రెండు పెళ్లి అని సమాచారం.