Guppedantha Manasu Serial Actress Jyothi Rai Acting in a Web Series Jyothi Rai Bold Photos goes Viral
Jyothi Rai : గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్(Serial) చూసేవారికి అందులో జగతి మేడం క్యారెక్టర్ బాగా పరిచయమే. కానీ ఇటీవల సోషల్ మీడియాలో కూడా జగతి మేడం పాపులర్ అయింది. ఈమె అసలు పేరు జ్యోతి రాయ్. కన్నడ భామ అయిన జ్యోతి రాయ్ తెలుగు, కన్నడ సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించింది. సీరియల్స్ లో ఇన్నాళ్లు తల్లి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ గా చీరలు కట్టి, బొట్టు పెట్టి సాంప్రదాయంగా కనిపించింది. కాని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా వైరల్ అవుతుంది.
సీరియల్స్ లో జ్యోతి రాయ్ ని చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు. రెగ్యులర్ గా షార్ట్ డ్రెస్సుల్లో తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది జ్యోతి రాయ్. తాజాగా తాను ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు ప్రకటిస్తూ తన సిరీస్ నుంచి రిలీజయిన పోస్టర్ ని షేర్ చేసింది. లయన్స్ గేట్ ప్లే(Lionsgate Play) అనే ఓటీటీకి ‘ప్రెట్టీ గర్ల్'(Pretty Girl) అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తున్నట్టు పోస్టర్ ని షేర్ చేసి ప్రకటించింది జ్యోతి రాయ్. ఇక ఈ పోస్టర్ లో కూడా హాట్ గా కనిపించింది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
Also Read : VD13 Movie : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. VD13 ఫిక్స్.. టైటిల్ అనౌన్స్ త్వరలో..
సోషల్ మీడియాలో ఇన్నాళ్లు హడావిడి చేసిన జ్యోతి రాయ్ ఇక వెబ్ సిరీస్ అయితే కచ్చితంగా తన అందాలు ఆరబోస్తూ నటిస్తుందని భావిస్తున్నారు. ఆమె అభిమానులు, నెటిజన్లు ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక జ్యోతి రాయ్ కి గతంలోనే పెళ్లయి ఒక బాబు కూడా ఉన్నాడు. కాని కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఒక డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం.