My Name Is Shruthi : ‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ.. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్‌తో వచ్చిన హన్సిక..

హన్సిక(Hansika) లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్ సబ్జెక్టుగా ఈ సినిమాని తెరకెక్కించారు

My Name Is Shruthi : ‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ.. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్‌తో వచ్చిన హన్సిక..

Hansika Motwani My Name Is Shruthi Movie Review and Rating

Updated On : November 16, 2023 / 11:55 PM IST

My Name Is Shruthi Review : యాపిల్ బ్యూటీ హన్సిక(Hansika) లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్ సబ్జెక్టుగా ఈ సినిమాని తెరకెక్కించారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఉంటున్న శృతి(హన్సిక) అనుకోకుండా ఓ హత్య చేస్తుంది. ఇదే సమయంలో అమ్మాయిల స్కిన్ తో బిజినెస్ చేసే ఓ మాఫియా ఓ రేర్ బ్లడ్ గ్రూప్, మంచి స్కిన్ టోన్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుంటారు. శృతి అర్జెంట్ గా ఊరు వెళ్లాల్సి రావడంతో శవాన్ని ఇంట్లోనే దాచేసి వెళ్లి వస్తుంది. శృతి వచ్చేసరికి తన అపార్ట్మెంట్ దగ్గర పోలీసులు ఉండటంతో తను దాచిపెట్టిన శవం గురించి తెలిసిపోయిందా అని భయపడుతుంది. పోలీసులు వేరే పని మీద వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో శృతి అబ్బాయిని చంపితే అక్కడ అమ్మాయి శవం ఉండటంతో భయంతో అరుస్తుంది. దీంతో పోలీసులు లోపలికి వస్తారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు శవాన్ని ఎవరు మార్చారు?శృతి ఎందుకు హత్య చేసింది. స్కిన్ మాఫియా ఏంటి? వాళ్లకి శృతికి సంబంధం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా సాగుతుంది. హన్సిక గురించి, తన లవ్, ఫ్యామిలీ.. ఇలా మాములుగా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా కొంచెం ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్ అరగంట మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ముందుకు, వెనక్కి వెళ్తూ ఉండటంతో ప్రేక్షకుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది . ఇంటర్వెల్ వరకు కూడా అసలు పాయింట్ కి రాకుండా హన్సిక మీదే సాగదీస్తారు కథని. సినిమా స్కిన్ మాఫియా అని చెప్పారు కానీ ఎక్కడా కూడా దానికి తగ్గ సీన్స్ ఉండవు. అన్ని మాటలతోనే నడిపించేస్తారు.

టెక్నికల్ అంశాలకు వస్తే.. కెమెరా విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. మ్యూజిక్ చాలా చోట్ల హెవీగా ఉంటుంది. BGM సీన్స్ కి తగ్గట్టు లేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగానే పెట్టారు. కొని చోట్ల సీరియల్స్ లో ఇచ్చినట్టు మ్యూజిక్, కెమెరా షాట్స్ ఉండటంతో సినిమా ఫీల్ పోతుంది.

నటీనటుల విషయానికి వస్తే.. శృతి పాత్రలో హన్సిక మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో తను ఇచ్చే ట్విస్టులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నటుడు ప్రవీణ్ కొద్దిసేపే కనపడినా క్లైమాక్స్ లో మెప్పిస్తాడు. నిజాయితీ పోలీసాఫీసర్ గా మురళి శర్మ చాలా బాగా నటించారు. పూజ రామచంద్రన్ లేడి విలన్ గా ఓకే అనిపించింది. ఇక మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులంతా పర్వాలేదనిపిస్తారు.

Also Read : ET Express : సైంధవ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆ రోజే.. యానిమల్ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్‌

మొత్తంగా స్కిన్ మాఫియా గురించి హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో థ్రిల్లింగ్ సబ్జెక్టుని చెప్పాలని చూశాడు డైరెక్టర్. ఈ సినిమాకు రేటింగ్ 2 వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.