Hansika Motwani Visited Vijayawada Durgamma Temple for My Name is Shruthi Movie Promotions
Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి గత సంవత్సరం ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక ఇటీవల మళ్ళీ వరుస సినిమాలని లైన్లో పెడుతుంది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో తన అందాలతో అలరించిన హన్సిక ఇప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రాబోతుంది.
హన్సిక మెయిన్ లీడ్ లో నటించిన ‘మై నేమ్ ఈజ్ శృతి'(My Name Is Shruthi) సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. దీంతో హన్సిక, చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హన్సిక, చిత్రయూనిట్ కలిసి విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. హన్సిక దుర్గమ్మ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందుకుంది హన్సిక.
Also Read : Deepika Padukone : అవును బాలీవుడ్‌లో నెపోటిజం ఉంది.. దీపికా పదుకొనే సంచలన కామెంట్స్..
అమ్మవారి దర్శనానంతరం ఆలయం వెలుపల హన్సిక మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మై నేమ్ ఈజ్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చాను. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా నా చిత్రం రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను అని తెలిపింది.