Dhanush: హీరోగా ధనుష్ కొడుకు.. డైరెక్టర్ కూడా ఆయనే.. యాత్ర రాజా ఎంట్రీ ఫిక్స్!
తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న తమిళ స్టార్ ధనుష్(Dhanush).
Dhanush son Yatra Raja making his debut as a hero.
- కొడుకును డైరెక్ట్ చేయనున్న ధనుష్
- యూత్ ఫుల్ కంటెంట్ తో ఎంట్రీ
- త్వరలోనే అధికారిక ప్రకటన
Dhanush: ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు తమిళ స్టార్ హీరో ధనుష్ కొడుకు యాత్ర రాజా. అవును, తన నట వారసుడిని ఎంట్రీ కోసం ఇదే సరైన సమయం అని ఫిక్స్ అయ్యాడట ధనుష్. అందుకోసం తానే అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. నిజానికి, ధనుష్(Dhanush) మంచి నటుడు అలాగే రచయిత, దర్శకుడు కూడా.
గతంలో కూడా ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే, ఇప్పుడు తన తనయుడి సినిమా కోసం కూడా తానే కథను సిద్ధం చేసి దర్శకత్వం వహించాలని చూస్తున్నాడట. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది అని సమాచారం. అయితే, ఈ కథలో ముందు తానే నటించాలని అనుకున్నాడట ధనుష్. కానీ, పాత్ర వయసు మరీ చిన్నది కావడంతో ఆ అవకాశం తన కుమారుడికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.
Sonal Chauhan: పొట్టి డ్రెస్సులో గ్లామర్ ట్రీట్.. రచ్చలేపుతున్న లెజెండ్ బ్యూటీ.. ఫొటోలు
ఈ కథ కోసం యాత్ర రాజాను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నాడట ధనుష్. తన స్వంత నిర్మాణ సంస్థ అయిన వన్దర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆ సినిమా తెరకెక్కనుంది అని సమాచారం. ఇప్పటికే, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవడంతో ప్రీ కాస్టింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారట మేకర్స్. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది.
ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఈ ఇయర్ ఎండింగ్ కి లేదా 2027 సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట ధనుష్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి, ధనుష్ వారసుడు తన మొదటి సినిమాతో ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తాడు అనేది చూడాలి.
