Varanasi: రాజమౌళి మాస్టర్ ప్లాన్.. కాశీలో హోర్డింగ్ బోర్డ్.. రిలీజ్ డేట్ చెప్పేసిన జక్కన్న
వారణాసిలో 'వారణాసి(Varanasi)' సినిమా రిలీజ్ డేట్ హోర్డింగ్ బోర్డ్.
Varanasi movie release date hoarding boards in Varanasi city.
- రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్ పీక్స్
- వారణాసిలో ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్ హోర్డింగ్ బోర్డ్
- ఫుల్ హ్యాపీ ఫీలవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. పాన్ వరల్డ్ లెవల్లో దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అందుకే, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ వీడియోకి ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే వారణాసి సినిమా 2027లో విడుదల అవుతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ, ఏ డేట్ లో విడుదల అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. కానీ, తాజాగా వారణాసి(Varanasi) సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్.
అది కూడా రాజమౌళి స్టయిల్లో చాలా వినూత్నంగా. ఎలా అంటే, బుధవారం నుంచి కాశీ(వారణాసి)లో భారీ హోర్డింగ్ బోర్డ్స్ ప్రత్యేక్షం అయ్యాయి. ఆ హోర్డింగ్ బోర్డ్ లో ఏప్రిల్ 7, 2027 విడుదల అని రాసి ఉంది. కానీ, దానిపై ఎలాంటి సినిమా పేరు లేదు. దాంతో, ఆ హోర్డింగ్ బోర్డ్ వారణాసి సినిమా గురించి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ గా మారింది. వారణాసి అని టైటిల్ పెట్టి వారణాసి నుంచే తన సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు రాజమౌళి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అది కూడా ఏడాది ముందు నుంచి. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలంటే అది జక్కన్న తోనే సాధ్యం, అది ఖచ్చితంగా వారణాసి సినిమా గురించే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఏడాది ముందు నుంచే ఈ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే విడుదల టైంలో ఆ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ఊహకు కూడా అందడం లేదు. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. మరో మూడు 5 నెలల్లో షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ వర్క్ మొదలుపెట్టనున్నాడట జక్కన్న. ఇక వారణాసి విడుదల తేదీ తెలియడంతో జక్కన్న ఫ్యాన్స్, మహేష్ బాబు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేస్తుందా అని.
