Sai Dharam Tej: మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్.. సరికొత్తగా సాయి ధరమ్ తేజ్.. డైరెక్టర్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
'క' సినిమా దర్శకులతో కొత్త సినిమా చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).
Hero Sai Dharam Tej doing a film under Sandeep-Sujith direction. (1)
- ‘క’ దర్శకులతో సాయి ధరమ్ మూవీ
- మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో
- త్వరలోనే అధికారిక ప్రకటన
Sai Dharam Tej: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విరూపాక్ష లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాడు. అయితే. రెగ్యులర్ సినిమాలు చేయడానికి ఇష్టపడని సాయి ధరమ్ చాలా గ్యాప్ తీసుకొని ‘సంబరాల యేటి గట్టు’ అనే సినిమాను మొదలుపెట్టాడు.
సరికొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). కఠినమైన ఫుడ్ డైట్ మైంటైన్ చేస్తూ తన బాడీని ఫుల్లుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఆ టీజర్ లో సాయి ధరమ్ టెక్ లుక్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Dhanush: హీరోగా ధనుష్ కొడుకు.. డైరెక్టర్ కూడా ఆయనే.. యాత్ర రాజా ఎంట్రీ ఫిక్స్!
అయితే, తన నెక్స్ట్ సినిమా కోసం కూడా మరోసారి డిఫరెంట్ కథనే ఎంచుకున్నాడట హీరో సాయి ధరమ్ తేజ్. అవును, ‘క’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకద్వయం సందీప్- సుజీత్. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా క సినిమా స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్ మైండ్ బ్లాక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే సాయి ధరమ్ తేజ్ ను ఒప్పించారట సందీప్- సుజీత్. ఈ దర్శకద్వయం చెప్పిన పాయింట్ కి సాయి ధరమ్ ఫిదా అయ్యాడట. వెంటనే, ఒకే చెప్పేశాడట. ఆయన ప్రస్తుతం చేస్తున్న సంబరాల యేటి గట్టు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడట సాయి ధరమ్ తేజ్. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
