Deepika Padukone : అవును బాలీవుడ్‌లో నెపోటిజం ఉంది.. దీపికా పదుకొనే సంచలన కామెంట్స్..
తాజాగా దీపికా పదుకొనే ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడింది.

Deepika Padukone Sensational Comments on Bollywood Nepotism
Deepika Padukone : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వరుసగా భారీ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. కన్నడ సినిమా ‘ఐశ్వర్య’తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా ఆ తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ అయిపొయింది. కానీ అంతకుముందు చాలా సంవత్సరాలు నటిగా మారడానికి కష్టాలు పడింది.
నెపోటిజం ఎక్కువగా ఉన్న బాలీవుడ్ లో ఒంటరిగా వచ్చి హీరోయిన్ గా నిలదొక్కుకొని ఇప్పుడు బాలీవుడ్స్ స్టార్ హీరోయిన్ అయింది దీపికా పదుకొనే. ఇటీవలే పఠాన్, జవాన్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన దీపికా త్వరలో ప్రభాస్ కల్కి సినిమాతో రాబోతుంది. ఇక తన భర్త, నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) తో అప్పుడప్పుడు మీడియా ముందు కనపడి అలరిస్తుంది ఈ భామ.
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో రణవీర్, దీపికా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇందులో దీపికా.. తన ప్రేమ, బ్రేకప్ విషయాలన్నీ మాట్లాడింది. తాజాగా దీపికా పదుకొనే ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడింది. బాలీవుడ్ లో తమ వారసులకు స్టార్స్ అంతా ఛాన్సులు ఇప్స్తున్నారని, కొత్తవాళ్ళని తొక్కేస్తున్నారని, నెపోటిజం ఎక్కువగా ఉందని రెగ్యులర్ గా ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉంటాయి.
Also Read : Robo Shankar : తాగుడు వల్ల చావు దాకా వెళ్ళొచ్చాను.. ధనుష్ కి కూడా బాగా తాగే అలవాటు ఉండేది..
తాజాగా దీపికా పదుకొనే బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడుతూ.. ఒక ఇరవై ఏళ్ళ క్రితం నాకు సినిమాలు తప్ప ఇంకో మార్గం లేదు అనుకోని వచ్చాను. అప్పట్లో అవకాశాలు రావడం చాలా కష్టం. నా పేరెంట్స్ సినీ పరిశ్రమకు చెందిన వారు కాదు. నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్లు లేరు. మాములుగా సినీ కుటుంబంలోని పిల్లలకే ఛాన్సులు దక్కేవి. దీన్నే ఇప్పుడు నెపోటిజం అంటున్నారు. అది అప్పుడు ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఎప్పటికి ఉంటుంది. నెపోటిజం అందరూ అంగీకరించాల్సిందే అని చెప్పింది. దీంతో దీపికా పదుకొనే బాలీవుడ్ నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.