Robo Shankar : తాగుడు వల్ల చావు దాకా వెళ్ళొచ్చాను.. ధనుష్ కి కూడా బాగా తాగే అలవాటు ఉండేది..
కొన్నాళ్ల క్రితం రోబో శంకర్ మద్యానికి(Alcohol) బానిస అయ్యారు. బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ లో కూడా చేరారు. చివరికి చావు దాకా వెళ్లొచ్చారు.

Robo Shankar Interesting Comments on Dhanush Drinking Alcohol
Robo Shankar : తమిళ నటుడు రోబో శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా తమిళ్ సినిమాల్లో కెరీర్ మొదలుపెట్టిన రోబో శంకర్ ఆ తర్వాత వరుసగా తమిళ్ సినిమాలు, సిరీస్ లు, షోలు, సీరియల్స్ చేస్తూ వచ్చారు. తమిళ్ పెద్ద సినిమాల్లో కూడా రోబో శంకర్ కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ రోల్స్ లో నటించి మెప్పించారు.
అయితే కొన్నాళ్ల క్రితం రోబో శంకర్ మద్యానికి(Alcohol) బానిస అయ్యారు. బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ లో కూడా చేరారు. చివరికి చావు దాకా వెళ్లొచ్చారు. కొన్ని నెలల క్రితమే రోబో శంకర్ కోలుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే పలు సినిమాలు, ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నారు. తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోబో శంకర్ తన తాగుడు గురించి, ధనుష్(Dhanush) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Mega Children : మెగా మనవళ్ళు, మనవరాళ్లు.. ఒకే పిక్ లో.. చరణ్ కూతురు మిస్ అయిందే..
రోబో శంకర్ మాట్లాడుతూ.. నా తాగుడు వల్ల చాలా నష్టపోయాను. చావు వరకు వెళ్ళొచ్చాను. మారి సినిమా సమయంలో ధనుష్ చాలా సార్లు చెప్పాడు నాకు తాగుడు మానేయమని. ధనుష్ కూడా బాగా తాగేవాడు కానీ మానేద్దాం అని ఫిక్స్ అయ్యాక మానేశాడు. ఆ తర్వాత ధనుష్ ఎప్పుడూ తాగలేదు. పార్టీల్లో కూడా తాగేవాడు కాదు. అతను వెజిటేరియన్ కూడా. నన్ను కూడా మానేయమని సలహా ఇచ్చాడు కానీ నేనే విన్లేదు. ధనుష్ మారి సినిమాతో నాకు అవకాశం మాత్రమే కాదు జీవితాన్ని కూడా ఇచ్చాడు అని తెలిపాడు. దీంతో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.