Hansika Motwanni : దేశముదురు వివాదం.. ఇన్నేళ్ల తర్వాత ఇంజెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఇన్నేళ్ల తర్వాత హన్సిక దీనిపై స్పందించింది. (Hansika Motwanni)

  • Updated on- April 18, 2026 / 04:46 PM IST

Hansika Motwanni

Hansika Motwanni : దేశముదురు సినిమాతో 16 ఏళ్లకే హీరోయిన్ అయింది హన్సిక. అంత చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడం, తన స్క్రీన్ ప్రజెన్స్ అందర్నీ ఆశ్చర్యపోయింది. ఆ సినిమాలో తనని చూసిన తర్వాత ఆమె ఎదుగుదలపై కొన్ని రూమర్స్ వచ్చాయి. హన్సిక త్వరగా ఎదగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ వాడిందని, తన తల్లే ఆ ఇంజెక్షన్స్ ఇప్పించింది రూమర్లు కూడా వచ్చాయి.

అందుకే హన్సిక 16 ఏళ్లకే అలా కనిపిస్తుందని, హీరోయిన్ అవ్వడం కోసమే ఇంజెక్షన్స్ వాడి ఇలా తయారయిందని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఇన్నేళ్ల తర్వాత హన్సిక దీనిపై స్పందించింది.

Also Read : Sonali Raut : నా ఆరోగ్యం నాశనం చేసారు.. రెండు కోట్లు కట్టమని బిగ్ బాస్ నిర్వహులకు షాక్ ఇచ్చిన మోడల్..

దేశముదురు నుంచి ఆల్మోస్ట్ 50 సినిమాలకు పైగా చేసిన హన్సిక ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవలే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. తాజాగా బాలీవుడ్ లో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వగా హన్సిక ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ పై స్పందించింది.

హన్సిక మాట్లాడుతూ.. మీడియా అటెన్షన్ కోసం లేని విషయాలను చాలా సార్లు సృష్టిస్తారు. అసలు నాకు ఇంజెక్షన్స్ అంటే చిన్నప్పటి నుంచి భయం. ఇప్పటికి కూడా హెల్త్ బాగోకపోతే ఇంజెక్షన్స్ వేయించుకుంటే ఏడుస్తాను. అలాంటిది నేను గ్రోతింగ్ హార్మోన్స్ తీసుకున్నానని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఫేస్ కి కూడా బొటాక్స్ ఇంజెక్షన్స్ చేయించుకున్నాను అన్నారు అది కూడా అవాస్తవం. మా అమ్మపేరుని కూడా వాడారు. అసలు మా అమ్మని నా స్కిన్ టచ్ చేయనివ్వను. నేను సహజంగానే పెరిగాను. నా కష్టం, నటనతోనే అవకాశాలు తెచ్చుకున్నాను అని తెలిపింది. ఇన్నేళ్ళుగా వస్తున్న ఇలాంటి రూమర్స్ కి హన్సిక తాజాగా సమాధానమిచ్చింది.

Also Read : Raashii Khanna : పాపం.. హీరోయిన్ కారవాన్‌లోకి దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలుసా?