Hanuman director Prashanth Varma about sequel and another format release
Hanuman : టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మరికొన్ని గంటల్లో కొన్నిచోట్ల ప్రీమియర్స్, రేపు సినిమా రిలీజ్ కాబోతుంది.
దీంతో మూవీ మేకర్స్ విలేకర్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే హనుమాన్ కి సంబంధించిన ఓ అప్డేట్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆడియన్స్ కి తెలియజేశారు. హనుమాన్ సినిమా సక్సెస్ అయితే 3d వెర్షన్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తారట. ఆల్రెడీ 3d టీజర్ ని కూడా సిద్ధం చేసి పెట్టారట. దాని అవుట్ ఫుట్ బాగా వచ్చిందట. మరి ఈ హనుమాన్ అందర్నీ మెప్పించి సక్సెస్ ని అందుకుంటారా..? లేదా..? చూడాలి.
Also read : Miss Perfect Teaser : పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్.. టీజర్ చూశారా..?
కాగా ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ‘అధీర’ అనే సెకండ్ సూపర్ హీరో సినిమా అనౌన్స్ చేశారు. ఇక ఈ సూపర్ హీరో సిరీస్ లో హనుమాన్ 2 కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో యూనివర్స్ భవిషత్తు అంతా ఇప్పుడు హనుమాన్ సక్సెస్ పై ఉంది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణతో సినిమా గురించి కూడా ప్రశాంత్ వర్మ తెలియజేశారు. బాలయ్యకి ఆల్రెడీ ఓ స్టోరీ లైన్ వినిపించారట. అది బాలయ్యకు కూడా నచ్చిందట. కానీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇస్తామని పేర్కొన్నారు. బాలకృష్ణతో తెరకెక్కించబోయే చిత్రం ఒక కొత్త జోనర్ అని, ఇప్పటివరకు ఇండియాలో ఎవరు టచ్ చేయలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తెలియజేశారు.