HanuMan star Teja Sajja fires on media in trailer launch event
HanuMan : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో, వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి నేడు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లాంచ్ తరువాత మూవీ టీం మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో తేజ సజ్జ మీడియా వాళ్ళ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఇంటరాక్షన్ లో తేజ సజ్జతో ఒక మీడియా వ్యక్తి మాట్లాడుతూ.. “ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దగా ఉంది. మీరు ఆ కాన్వాస్ లో చాలా చిన్నగా కనిపిస్తున్నారు. మీ లెవెల్ కి దాటి వెళ్లారని మీకు అనిపించిందా” అంటూ ప్రశ్నించారు. దీనికి తేజ సజ్జ బదులిస్తూ.. “ఒక వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ స్టార్టింగ్ లోనే తనకి మించిన స్థాయిలో సినిమా చేస్తే మీరు ఇదే ప్రశ్న వేస్తారా. నేను వాళ్ళతో పోల్చుకోవడం లేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ వస్తున్నా. నిలబడడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అలాంటి ప్రయత్నమే హనుమాన్. నేను ఇంత కష్టపడి సినిమా చేస్తే మీరు సరిపోతారు అని అడుగుతుంటే నన్ను చిన్న చూపు చూసినట్లు అనిపిస్తుంది” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Also read : Salaar : కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటున్న ప్రశాంత్ నీల్..
ఇదే ఇంటరాక్షన్ లో బీజేపీకి ఈ మూవీకి సంబంధం ఉందా అని ప్రశ్నించగా, దర్శకుడు బదులిస్తూ.. “ఇప్పుడు లేదు. సినిమా రిలీజ్ తరువాత కచ్చితంగా వస్తుంది” అని చెప్పుకొచ్చారు. అలాగే తమని బజరంగ్ దళ్ కూడా సంప్రదించినట్లు తెలియజేశారు. కానీ తమ సినిమా నిర్మాణంలో తమకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. బజరంగ్ దళ్ మూవీ టీంని సంప్రదించినప్పుడు.. తమ సినిమాని ప్రమోట్ మాత్రమే చేయమని కోరారట. కాగా ఈ చిత్రం జనవరి 12న వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.