హ్యాపీ బర్త్‌డే.. రోహిత్‌కు చంద్రబాబు, లోకేష్ విషెస్..

  • Publish Date - July 25, 2020 / 01:14 PM IST

కొంతకాలం సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ కఠిన వ్యాయామాలు చేసి సరికొత్త లుక్‌ సాధించాడు. సిక్స్‌ప్యాక్ బాడీతో షాకిచ్చాడు. ఈ రోజు (శనివారం) రోహిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రోహిత్ పెదనాన్న, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అన్న నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు.

‘నారా రోహిత్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా నీకు సంతోషంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాన’ని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రియ సోదరుడు నారా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏ పని చేసినా అందులో నువ్వు ఉత్తమంగా ఉండాలి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాన’ని లోకేష్ ట్వీట్ చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేష్‌కు రోహిత్ కృతజ్ఞతలు చెప్పాడు.‘నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కరోనా రక్కసి కోరలు జాస్తున్న తరుణంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నారా వారి అభిమానులు ఎక్కడా వేడుకలు నిర్వహించవద్దు. ఫ్లెక్సీలు, ప్రకటనలు ఇవ్వవద్దు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ రోహిత్ శుక్రవారం ఓ లేఖ విడుదల చేశాడు.