15వ పెళ్లిరోజు – నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో నింపేశావ్‌ మహేష్

ఫిబ్రవరి 10 - సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతలు తమ 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకుంటున్నారు..

  • Publish Date - February 10, 2020 / 08:19 AM IST

ఫిబ్రవరి 10 – సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతలు తమ 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకుంటున్నారు..

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతల వివాహ వార్షికోత్సవం నేడు (ఫిబ్రవరి 10). 2005 ఫిబ్రవరి 10న మహేష్‌తో కలిసి నమ్రత ఏడడుగులేశారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మహేష్ ‘‘Happy 15 my love.. Love you a little more each day Namrata’’ అంటూ లవ్ సింబల్స్‌తో ట్వీట్ చేయగా.. దానికి బదులుగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

 

అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ మహేశ్‌కు తోడుగా నిలిచే నమ్రత శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి అమ్మాయి కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకందించావ్‌. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావ్‌. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. మీ సహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. ఇంతకన్నా ఏం కావాలి.. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని  నమ్రత పోస్ట్ చేశారు.

కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలో సూపర్‌స్టార్‌ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తాడు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్.. తనకు ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో తన 27వ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.