Hari Hara Veera Mallu: వీరమల్లు కొత్త పోస్టర్.. ఫెరోషియస్ లుక్‌లో పవన్ అదుర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి ఓ ‘పవర్ గ్లాన్స్’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. కాగా సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి ఓ ‘పవర్ గ్లాన్స్’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే అడ్వాన్స్‌గానే వీరమల్లు మూవీ యూనిట్, ఓ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేశారు. రథంపై దూసుకొస్తున్న వీరమల్లు పోస్టర్‌ను సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌ను ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అని చిత్ర యూనిట్ పేర్కొనడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం రెట్టింపు అయ్యాయి.

Hari Hara Veera Mallu Update: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పూనకాలు తెప్పించే అప్డేట్ రానుంది..?

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏఎం.ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రేపు(సెప్టెంబర్ 2) సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియో‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ 50 శాతం పూర్త‌యిందని.. త్వరలోనే చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు. ఇక ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి బాణీలు అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు