Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి.
HariHara Veeramallu Workshop : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ వర్క్‌షాప్
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వర్కషాప్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వర్క్‌షాప్‌లో హరిహర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్‌లకు సంబంధించి, స్టోరీకి సంబంధించి పలు దఫాలుగా చర్చలు సాగాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోని ఓ భారీ సెట్లో జరుగుతోందట. అయితే ఈ షూటింగ్లో ఓ వార్ ఎపిసోడ్‌ను దర్శకుడు క్రిష్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. ఈ సినిమా షూటింగ్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదట. ఆయన స్థానంలో ఓ డూప్‌ను పెట్టి వార్ సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan: మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్..
ఏదేమైనా పవన్ లేకుండానే, హరిహర వీరమల్లు యుద్ధం చేస్తున్నాడా.. అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రామ్‌పాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.