Pawan Kalyan: మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్..

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా "హరిహర వీరమల్లు". పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రాబోతుంది. కాగా ఇటీవలే సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ ని కూడా నిర్వహించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీలో...

Pawan Kalyan: మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రాబోతుంది. తన వీరోచితమైన పోరాట ప్రతిభతో తెలుగు గడ్డపై చెరగని ముద్రవేసిన “వీరమల్లు” పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.

RamGopal Varma: RGV కొత్త సినిమా “వ్యూహం”.. పవన్ కళ్యాణ్ బయోపిక్?

ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా కాలం అయినప్పటికీ, పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. కాగా ఇటీవలే సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ ని కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో భాగంగా పవన్ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా కసరత్తు చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయింది.

సుమారు 20 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.